ఓ సాఫ్ట్‌వేర్ పెళ్లి తిప్పలు సరదాగా ట్రేన్ లో - Blog

Post Top Ad

Welcome to Hindu Roots

ఓ సాఫ్ట్‌వేర్ పెళ్లి తిప్పలు సరదాగా ట్రేన్ లో

Share This
మొన్న నేను చెన్నై కి ప్రయాణం చేస్తున్నాను.. నా సీట్ / బెర్త్ కన్ఫర్మ్ అవ్వలెధు ఇంకా Wళ్ 2 లో ఉంది నేను తాత్కాల్ కౌంటర్ లో టికెట్ టేసుకున్నాను. సరే కదా అని ట్ సీ ని కలిశాను ఏదన్నా బెర్త్ ఉందేమో అని, ట్ సీ చాలా తెలివి మంతుడు. తనకి డబ్బులు ఇవ్వమని అడగా కుండా ఎక్కడ కాలి ఉంటే అక్కడ సాద్దుకు పొండి బెర్త్ లు అన్ని ఫుల్ గా ఉనై అని అన్నాడు.
నిజమేమో అని నమ్మి నేను బెర్త్ లో ఒకచోట సాద్డకుపోయాను కానీ కాసేపటి తర్వాత జనరల్ టికెట్ ఉన్న అతనికి సీట్ / బెర్త్ కన్ఫర్మ్ చేశాడు ఫైన్ తో రాసి మరి ఆర్ C ఉన్న వాళ్ళకి కూడా బెర్త్ కన్ఫర్మ్ చేయలేదు..అదేంటి అని అడిగితే నీకు ఎందుకు ఇది సమాదనం. హైడేరాబాద్ నుండి విజయవాడ వరకు వచిన వాడు ఒక ఎత్తు విజయవాడ నుండి వచినవాడు ఇంకో ఎత్తు..మొత్తానికి సాద్డకుపోయి వొచ్చాను చెన్నై కి.

నెల్లూర్ లో ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ ఎక్కాడు నాలాగే సాద్డకుపోయాడు సీట్ లో.
కాసేపట్లో ఒక అమ్మాయి కూడా ఎక్కింది తను కూడా సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంది అంట చివర్లో తెలిసింది నాకు.
అరగంట తర్వాత ఏదో టాపిక్ మాట్లాడుతూ ఒకతను అన్నారు. ట్రేన్ లో దాదాపు 90% మంది అందరు సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ లే ఉంటారు అండీ.
అప్పటికే అదో సాఫ్ట్‌వేర్ లోకం లా మారింది చుట్టూ వల్లే.
అబ్బాయి ఏమో తాను ఇప్పటి వరకు చాలా బాగా అర్దం చేసుకున్నాడు అమ్మాయిలు ఎలా ఉన్నారో ఎం కావాల్లో తరం లో !!
ఇదేంటి ఇలా అంటున్నాడు అని అడిగితే...నేను ఇప్పటివరకు 38 సమంధాలు చూశాను అండీ ఒక్క అమ్మాయికి కూడా నేను నచ్చలేదు అంట. అన్ని రకములగా అన్ని ఉన్నై కానీ ఏంటి లోపం అర్దం కావట్లేధు. ఇంతలో ఎదురుగా ఉన్న అమ్మాయి ..టైమ్ రావాలండి అంది మీరు ఎం చేసినా. ఎం చేయాలెఢు అని అడగండి...
ఇంట్లో వాళ్ల మాటలు..బాబోఇ ..చివరకి ఎవరో ఒక అమ్మాయిని అన్నా ప్రేమించి పెళ్ళిచేసుకో అనే మాట అన్నారు. గుడుల చుట్టూ తిప్పారు పూజలు చేయించారు..నాడి జ్యోశ్యం చేపించారు..కానీ ఫలితం ఏమీ లేదు.
ఇప్పటికే 32 కానీ నా పెళ్లి అయ్యేసరికి ఇంకా పిల్లలు నేను ముసలి వాడిని ఈతే వాళ్ళు చిన్న పిల్లల ఉంటే మరి ఎం బాగుంటాది కదండి అని తన గురుంచి చెప్పు కోచ్చాడు.

ఎదురుగా ఒక్క అమ్మాయిని పెట్టు కొని తాను ఇలా అన్నాడు...మొన్న కాక మొన్న ఒక సంబందం కి వెళ్ళాను అమ్మాయి బొండాం ఉంది దానికి కూడా నచ్చలేదంటా నేను...మరీ విచిత్రం కాక పోతే. అందరికి మహేష్ బాబు కావాలనే పిచ్చి పెరిగి పోయిందండి కాలం అమ్మాయిలకి.
మాటలు విన్నాక నేను నవ్వలెక పోయాను..నా నవ్వు కి అంతం లెధు. అందరం నవ్వడమే..అతని మాటలు విని.
 ఇవ్వాళ రేపు ఒక సాఫ్ట్‌వేర్ కి అమ్మాయిని ఇవ్వడానికి బయపడుతున్నారు జనం..మీకు తెలుసా.
లేక పోతే ఏంటండి ఒకటి కాదు రెండు కాదు 38 చూశాక కూడా కుదరక పోవడం. వాళ్ళు చెప్పే సమదానం ఒకటే మేము మీకు ఫోన్ చేస్తాం ...అంతే ఇంక ఫోన్ ఉండదు ఎమ్మి ఉండదు.
అనితా తాను చాలా పాసిటివ్ గా తీసుకుంది అమ్మయిలని అన్నప్పుడు లేక పోతే గొడవే. తెలిసిందే కదా.
అతని పేరు రఘు, అమ్మాయి పేరు అనితా, నా పక్కన ఉన్న మెడికల్ ఇంచార్జ్ పేరు నవీన్.
ఇన్నాలు సినిమా లో ఉన్న పెళ్లి కానీ ప్రసాద్ కె కష్టాలు అనుకున్నా కానీ నిజ జీవితం లో పెళ్లి కానీ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్ కష్టాలు విన్నాక ఆశ్చర్య పోయాను.
మొతానికి నా జర్నీ చాలా బాగా చేశాను..
కొత్త పరిచయాలతో.
మీ
మణీందర్ కుమార్.

( నేను నా ప్రాయాణం :ఇధినేనేనా - మణీందర్ కుమార్.!!)

Post Bottom Ad

Welcome to Hindu Roots

Pages